![]() |
![]() |

కుక్కు విత్ జాతిరత్నాలు షో ప్రతీ వారం కొత్త కొత్త థీమ్స్ తో జాతిరత్నాలు వచ్చి ఆడియన్స్ ని జడ్జెస్ ని అలరిస్తున్నారు. ఇక కుక్కులు ఐతే మంచి మంచి డిషెస్ ని జడ్జెస్ కి తినిపిస్తున్నారు. ఇక వీళ్ళు వేసే గెటప్స్ వాటి వెనక ఎం జరుగుతుంది అనేది ఎవరికి తెలీదు కదా. ఐతే ఈ షోలో జాతిరత్నంగా ఎంటర్టైన్ చేస్తున్న ఇమ్ము ఒక రీల్ చేసి తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసాడు. "బాగా అలిసిపోయిన తరువాత వేడి వేడి టీ ఒక సిప్ తాగితే ఆ సుఖమే వేరైంది.

మీలో ఎంత మంది టీ లవర్స్ ఉన్నారో కింద కామెంట్ చేయండి. నమస్తే తెలుగు ప్రజలారా ఈ గెటప్ ఏంటో గుర్తుపట్టారా. ఈ రీల్ ఐపోయేలోపు మీరే గుర్తుపడతారు. వెయిట్ చేయండి. కుక్కు విత్ జాతిరత్నాలు షూటింగ్ ఎలా జరిగిందో చెప్తాను హ్యాపీగా వినేయండి. బేసిక్ గా మేము రోజూ రెండు ఎపిసోడ్ లు షూటింగ్ చేస్తాము. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక ఎపిసోడ్ సాయంత్రం నుంచి మిడ్ నైట్ వరకు ఒక ఎపిసోడ్ షూట్ చేస్తాం. ఉదయం నుంచి సాయంత్రం జరిగిన ఎపిసోడ్ లో లాస్ట్ వీక్ వేసిన అవతార్ గెటప్ వేసానన్నమాట. ఇది సాయంత్రం ఎపిసోడ్ . హెల్ అండ్ హెవెన్ థీమ్. ఆల్రెడీ ప్రోమో వచ్చింది కదా మీరంతా చూసే ఉంటారు. ఆ థీమ్ లో నేను అనాబెల్లె గెటప్ వేసానన్నమాట. నాకు విగ్గులు అవి పెట్టి రెడీ చేస్తున్నారు కాస్ట్యూమర్స్. అంటే ఒకే రోజు రెండు గెటప్ లు అండి . అవతార్, అనాబెల్లె . దూల తీరిపోయిందనుకోండి. సో ఏదేమైనా ఫైనల్ గా గెటప్ ఐతే అద్దిరిపోయింది. ఈ సీజన్ లో నేను వేసిన నచ్చిన ఒక బెస్ట్ గెటప్ ఇది.
ఎపిసోడ్ లో శ్రీదేవి గారు కూడా చూసి చాలా క్యూట్ గా ఉన్నావ్ ఇంటికెళ్లి దిష్టి తీయించుకో అన్నారు. ఏదయినా దెయ్యం గెటప్ వేసినా కూడా క్యూట్ గా ఉన్నానంటే అది మన స్పెషల్ అనుకోండి. అందరినీ ఎంటర్టైన్ చేయడానికి ఇంతమందిమి కష్టపడతాము " అంటూ ఒక రీల్ చేసాడు ఇమ్మానుయేల్. అలాగే కింద ఒక ఫ్యాన్ కామెంట్ ని కూడా పోస్ట్ చేసాడు. "మా పాపకు నువ్వంటే చాలా చాలా ఇష్టం ఇమ్ము. నీ కోసమే ఈ షో చూస్తోంది. ఎంత కష్టపడుతున్నారు " అంటూ ఆ కామెంట్ లో చెప్పారు.
![]() |
![]() |